
హామీలను నెరవేర్చాలి
రేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ మడిపల్లి శ్యాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జ్ దోర్నాల రాజేందర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల, చేయూత పెన్షన్‌దారుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులు, చేయూత పెన్షన్‌దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌లను పెంచాలని లేనియెడల పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న మండలకేంద్రంలో నిర్వహిస్తున్న సన్నాహక సభకు మందకృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో పెన్షన్‌దారులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, నాయకులు నోముల శ్రీనివాస్, మంద తిరుపతి, ఎర్ర భద్రయ్య, ఆరెపల్లి రాజు, కొండమల్ల విష్ణు పాల్గొన్నారు.