
దాడుల నియంత్రణకు చర్యలు
కాటారం: ఎస్సీ ఎస్టీలపై దాడుల నియంత్రణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, దళితుల భూ సమస్యలపై కాటారం మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్‌హాల్‌లో శనివారం దళిత బహుజన ఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్, శంకర్ మాట్లాడుతూ దళితులపై దాడుల విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. చింతకాని శివారులోని 241 సర్వేనంబర్‌లో భూ ఆక్రమణకు ప్రయత్నించిన న్యాయవాదిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు బాల్‌రాజు, మధు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.