
భూ సేకరణకు రైతులు సహకరించాలి
● ఆర్డీఓ వెంకటేశ్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి పనులు, భూ సేకరణకు రైతులు సకరించాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో గల ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లోని సమావేశ మందిరంలో భూ సేకరణపై బాధిత రైతులతో ఆయన శనివారం సమావేశం అయ్యారు. భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులకు 20 ఎకరాల స్థలం అవసరమని గుర్తించి రైతులతో ఆర్డీఓ వెంకటేశ్ మాట్లాడారు. రైతులు ముందుగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ డిజైన్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు.