
23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి
ములుగు: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధికి ఈ నెల 23 (మంగళవారం)న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నట్లు తెలిసింది. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. అభివృద్ధిపై సమీక్ష అనంతరం డిజైన్లను సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేస్తారని సమాచారం. శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై ఐసీసీసీలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
కాళేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు–పద్మ దంపతులు దర్శించుకున్నారు. శనివారం ఆయన ఆలయానికి రాగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశారు. ఆశీర్వచన వేదికపై ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఆయనకు శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏరియా స్థాయి లాల్ టెన్నిస్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా సర్వే అధికారి శైలేంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు కేవలం ఆనందానికి మాత్రమే కాదని ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, కెప్టెన్‌లు మల్లేష్, శ్రీరాములు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలకు చెందిన నాగేశ్వరి సబ్ జూనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 18న జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో నాగేశ్వరి ప్రతిభ కనబర్చడంతో నిర్వాహకులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి చల్ల సునీత తెలిపారు. ఈ నెల 25నుంచి 28వరకు నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్‌ఓ పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని ఎస్‌ఓతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లాస్థాయి పోటీలకు
ఎంపిక
కాళేశ్వరం: ఈనెల 16 నుంచి 19 వరకు జరిగిన మండలస్థాయి పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయికి విద్యార్థులు ఎంపికయ్యారు. మహదేవపూర్ బాలుర ఉన్నత అండర్ 17 వాలీబాల్‌లో ప్రథమ స్థానం, అండర్ 14 వాలీబాల్‌లో ప్రథమస్థానం, అండర్ 17 ఖోఖో లో జాయింట్ వినర్స్‌గా నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు శిరంగి రమేష్ శనివారం తెలిపారు. త్వరలో జరిగే జిల్లాస్థాయిలో పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి

23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి

23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి