
ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త
● పండుగ వేళ చోరీలు జరిగే అవకాశం
● జాగ్రత్తలు పాటించాలంటున్న పోలీసులు
భూపాలపల్లి: కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి పట్టణంలో వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వారు ఉద్యోగ రీత్యా ఇక్కడ నివాసం ఉంటారు. నేటినుంచి పాఠశాలలకు బతుకమ్మ, దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో సొంత గ్రామాలు, దైవ దర్శనాలు, టూర్‌లకు వెళ్తారు. ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి
● ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
● ఊరికి వెళ్తే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
● తద్వారా పోలీసులు రాత్రి వేళ గస్తీ ఇంటి పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తారు.
● ఊరికి వెళ్తున్న విషయాన్ని కనిపించిన అందరికీ చెప్పకూడదు.
● సెలవు దినాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
పెట్రోలింగ్ పెంచుతాం..
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో పిల్లలకు సెలవులు వచ్చి సొంత ఊర్లకు వెళ్తున్న వారు తగు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. స్థానికంగా ఉన్న వారికి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. ఊర్లకు వెళ్తున్న వారు తప్పకుండా పోలీసులకు తెలియజేయాలి. సమాచారం ఇస్తే రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలో పోలీసు సిబ్బంది పహారా కాస్తారు. సెలవుల నేపథ్యంలో రాత్రివేళ పెట్రోలింగ్ మరింత పెంచుతాం. ప్రతీ కాలనీలో గస్తీ నిర్వహిస్తాం.
– డి నరేష్‌కుమార్, సీఐ, భూపాలపల్లి

ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త

ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త