
కారిడార్ భూసేకరణ పూర్తి చేస్తాం
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించనున్న కారిడార్‌కు సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 12 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ నిర్మాణ భూసేకరణపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్–విజయవాడ కారిడార్, మహదేవపూర్–కాళేశ్వరం జాతీయ రహదారి వెడల్పునకు అటవీశాఖ భూ కేటాయింపు పురోగతిపై సీఎస్ సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్‌అండ్‌బీ డీఈ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.