
ఐదు వందలకు పైగా..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 500నుంచి 525 బస్తాల సిమెంట్ అవసరముంటుంది. నెల రోజుల క్రితం బస్తా ధర రూ.280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్ ను బట్టి ఒక్కొ బస్తాపై రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ.1.47లక్షలు సిమెంట్ ఖర్చు వచ్చేది. ప్రస్తుత రేటును బట్టి బస్తాకు అదనంగా రూ. 50 అదనంగా వేసుకున్న రూ.1.73,250 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడిపై సిమెంట్ రూపేణ రూ.26,250 వేల వరకు అదనపు భారం పడుతుంది. స్టీల్ ధర కంపెనీని బట్టి గతంలో క్వింటాలుకు కనిష్టంగా రూ.5,500 ఉండగా ఇప్పుడు గరిష్టంగా రూ.7,800కు చేరింది. ఇంటి నిర్మాణానికి కనీసం 1.5 టన్నుల సిమెంట్ పడుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. రూ.5,500 చొప్పున స్టీలుకు రూ.82,500 అవుతుండగా సగటున క్వింటాల్‌కు రూ.7500 చొప్పున రూ.1,12,500 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన రూ.37 వేల వరకు అదనపు భారం పడుతుంది.