
లోపాలు లేని బిల్లింగ్ విధానం
భూపాలపల్లి రూరల్: విద్యుత్ బిల్లుల అందజేతలో వేగం, మరింత పారదర్శకతను పెంచేందుకు ‘ఆటోమేటిక్’ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) వ్యవస్థను రూపొందించామని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు మాన్యువల్ బిల్లింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు ఏఎంఆర్ విధానం ఎంతగానో దోహదపడుతుందని స్పష్టంచేశారు. సర్కిల్‌లో అధిక సామర్థ్యం విద్యుత్ వినియోగించే పరిశ్రమలకు వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కాటారం: మండలంలోని మేడిపల్లి, మద్దులపల్లి గ్రామాల సమీపంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయాలపాలయ్యారు. భూపాలపల్లి వైపు నుంచి కాటారం వైపుగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు డ్రైవర్‌తో పాటు పలువురు గాయాలపాలయ్యారు. మద్దులపల్లి వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులు గాయాలపాలవగా చికిత్స నిమిత్తం మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
భూపాలపల్లి అర్బన్: న్యాయవాదులపై వరుసగా జరుగుతున్న భౌతిక దాడులను నిరసిస్తూ శుక్రవారం జిల్లాలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ బార్ అసోసియేషన్ సభ్యులు సాయికుమార్, నాంపల్లికి చెందిన హనుమంత్‌నాయక్‌పై భౌతికదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో న్యాయవాదుల రక్షణ చట్టం ప్రవేశపెట్టి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మహేందర్, రవీందర్, రాజ్‌కుమార్, రమేష్, రవీందర్, సుధాకర్ పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతాయని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఏరియాలోని కేటీకే ఒకటో గనిలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాలలో జరిగిన ఒప్పందాలను అమలు చేయించడంలో గుర్తింపు సంఘం దృష్టి సారించడం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే నిరసన కార్యక్రమాలు చేపట్టడం కాదని.. పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వాస్తవ లాభాల వాటా ప్రకటించి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ యూనియన్‌ల నుంచి సీఐటీయూలో చేరిన కార్మికులకు రాజిరెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు రాజయ్య, బందు సాయిలు, తోట రమేష్, బాబురావు, దేవేందర్ పాల్గొన్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గోదావరి వరద తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం కాళేశ్వరం పుష్కరఘాటు వద్ద 9మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బ్యారేజీలో 6.25లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలి వస్తుంది. దీంతో బ్యారేజీలో 85గేట్లు ఎత్తి దిగువకు వరదను తరలిస్తున్నారు. మూడు రోజుల కిందట ఎగువన వర్షాలు కురువడంతో కాళేశ్వరం వద్ద 11.500మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదు కాగా, మేడిగడ్డ బ్యారేజీలో 9.50లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిపోయింది.

లోపాలు లేని బిల్లింగ్ విధానం

లోపాలు లేని బిల్లింగ్ విధానం