
సమస్యల పరిష్కారానికి సమ్మెకు సిద్ధం
భూపాలపల్లి అర్బన్: స్ట్రక్చర్ మీటింగ్‌లో జరిగిన ఒప్పంద సమస్యలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మె చేయడానికై నా సిద్ధంగా ఉన్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ హెచ్చరించారు. సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జీఎం కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటపలుకుల రమేష్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి 35శాతం కార్మికులకు వాటా చెల్లించాలన్నారు. కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదని సీఎండీతో జరిగే స్ట్రక్చర్ మీటింగ్‌లను బహిష్కరించినట్లు చెప్పారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలని, సింగరేణిలో నూతన గనులు రావాలని లేదంటే సింగరేణి భవిష్యత్‌కే ప్రమాదమని తెలిపారు. అనంతరం వివిధ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని జీఎం కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి రామచందర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, చంద్రమౌళి, రవికుమార్, విజేందర్, పోశం, కృష్ణమూర్తి, నారాయణ పాల్గొన్నారు.
జీఎం కార్యాలయం ఎదుట ధర్నా