
క్రీడలతో మానసికోల్లాసం
కాళేశ్వరం: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. మహదేవపూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో జరుగుతున్న వాలీబాల్, కబడ్డీ, ఖోఖో జోనల్ స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమానికి శుక్రవారం హాజరై మాట్లాడారు. ఏ వ్యక్తి అయినా తను ఎంచుకున్న రంగంలో రోజూ ఓ గంట ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రకాశ్‌బాబు, పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతి, బాలుర పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం ప్రభాకర్‌రెడ్డి, బాలికల పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం మడక మధు, గ్రీన్‌వుడ్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, గుడ్ మార్నింగ్ స్కూల్ కరస్పాండెంట్ సూర్యజిత్, ఎస్‌జీఎఫ్ జోనల్ సెక్రటరీ సిరంగి రమేష్, మండల కన్వినర్ కార్తీక్ పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
కోట రాజబాబు