
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
జనగామ: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండేరి చేతన్ నితిన్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఏకశిల బీఈడీ, ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల(అటానమస్)ల్లో పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్, జనగామ మండలం డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సంబంధించి గౌతమ్ మోడల్ స్కూల్‌ను వారు సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు ఉండాలని అధికారులకు సూచించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్న వసతి సౌకర్యాల కల్పనకు సంబంధించి పలు సూచనలు ఇచ్చారు. పోలీస్ బందోబస్తు, రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జనగామ ఎంపీడీవో, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
మైనార్టీ మహిళలు
ఆర్థికాభివృద్ధి సాధించాలి
జనగామ రూరల్: మైనార్టీ మహిళలు అన్ని రంగాల్లో ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్సీ అమీర్‌ఖాన్ ఆకాంక్షించారు. శనివారం పట్టణంలోని గిర్నిగడ్డ, గుండ్లగడ్డలో కాంగ్రెస్ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జమాల్ షరీఫ్ ఆధ్వర్యంలో సీయాసాత్ హబ్ మైనార్టీ వెల్ఫేర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. ప్రతీ పేద ముస్లిం మహిళల నెలకు రూ.100 చొప్పున మైనార్టీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ పథకంలో 5 ఏళ్లు చెల్లిస్తే 1000 మంది మహిళలతో మొత్తం రూ.60లక్షలు అవుతాయని, సీయాసాత్ హబ్ ద్వారా సంవత్సరానికి 10 లక్షలు జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో మౌలానా షకీరా హుస్సేన్, మౌలానా అబ్దుల్ రహమాన్, మౌలానా మసి ఆర్ రెహ్మాన్, రఫ్ మతీన్ అడ్వకేట్, అబ్దుల్ మన్నాన రాజీ పాల్గొన్నారు.
రేపు ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స ర్పంచ్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
వీరాచలరాముడి సేవలో
రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ చైర్మన్
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామిని శనివారం రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ చైర్మన్, మెంబర్ ఆఫ్ సెక్రటరీ జడ్జి చిలుకమారి పంచాక్షరి, ఆయన సతీమణి కావ్యశ్రీ దర్శించుకున్నారు. వేదపండితులు భార్గవాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్రాన్ని వేదపండితులు వివరించారు. ఈఓ వంశీ, కమిటీ చైర్మన్ మూర్తి తదితరులు ఉన్నారు.
జనగామ: మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో శనివారం రాత్రి పోలీసులు విస్త్రతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ స్వయంగా తనిఖీలను పర్యవేక్షించారు. ఏఎస్పీ వెంట ఎస్సైలు రాజన్ బాబు, చెన్నకేశవులు, తదితరులు ఉన్నారు.

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు