
చదువుకు పేదరికం అడ్డుకాదు
స్టేషన్‌ఘన్‌పూర్: చదువుకు పేదరికం ఏమాత్రం అడ్డుకాదని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లు జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన 165 మంది విద్యార్థులకు హన్మకొండ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్‌లను అందించారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో హెచ్‌ఎం జి.కొమురయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హన్మకొండ రోటరీక్లబ్ సెక్రటరీలు ఎంవీ ఇలమురుగు, కేఎం శివకామి, స్కూల్ బ్యాగుల దాతలు ఎన్‌ఆర్‌ఐలు శ్రేయ, అభిరామ్, ఘన్‌పూర్ జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం సంపత్, రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ తిరుపతిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్