
కలాం ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం
లింగాలఘణపురం: మండలంలోని మోడల్ స్కూల్‌కు చెందిన 8మంది బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ సునిత అబ్దుల్ కలామ్ ఎక్స్‌లెన్స్ అవార్డులతో సన్మానించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు అవార్డులను అందజేస్తున్నారు. ఈ ఏడాది సాయివరుణ్, సందీప్, శివ, రిషిత, కుసుమాంజలి, భవాని, పూజ, సంజన అనే విద్యార్థులు సీట్లు సాధించగా వారిని కలాం ఎక్సలెన్స్ అవార్డులతో సన్మానించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షుడు దేవునూరి ఆనంద్, జమ్ముల వీరారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.