
గంగమ్మ ఒడికి దుర్గమ్మ
ఊరేగింపుగా బతుకమ్మకుంట అమ్మవారు
బతుకమ్మకుంట అమ్మవారి నిమజ్జనం
● జిల్లా వ్యాప్తంగా శోభాయాత్రలు,
నిమజ్జనాలు
జనగామ: విజయదశమి పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శ్రీ దేవినవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పది రోజుల పాటు భక్తుల కోలాహలంతో అమ్మవారి మండపాలు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌న్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలో 40కి పైగా అమ్మవార్లు కొలువుదీరగా, ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు, మాలలు ధరించిన భవానీమాతాలు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి శోభాయాత్రలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పదిరోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న అమ్మవారు పదకొండో రోజు నిమజ్జనానికి బయలుదేరగా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ శోభాయమానంగా మారాయి. పట్టణంలోని శ్రీవిల్లాస్ కాలనీ టీంఎస్‌బీసీ, అంబేడ్కర్‌నగర్ 14వ వార్డు ముస్లిం మైనార్టీ కాలనీలోని శ్రీ దేవీ నవరాత్రి నిమజ్జన ఉత్సవం ఘనంగా జరిగింది. వేడుకల్లో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ చైర్మన్ దూసరి ధనలక్ష్మిశ్రీకాంత్ పాల్గొన్నారు. పాతబీటు బజారు గణేశ్ యూత్ ఫ్రెండ్స్, లక్ష్మిభాయ్‌కుంట, ఈ సేవా ఏరియాలోని బొడ్రాయి, గిర్నిగడ్డ హనుమాన్ టెంపుల్, ఉప్పలమ్మ ఆలయం, మూలబావి శ్రీ సీతారామచంద్రస్వామి, తదితర ఏరియాలో కొలువు దీరిన అమ్మవార్లను నిమజ్జనం చేశారు. నిమజ్జన ఊరేగింపుల్లో ఇబ్బందులు కలుకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. తహసీల్ కార్యాలయ ఆవరణలోని అమ్మవారిని ఊరేగింపు నిర్వహించి, శ్రీ సంతోషిమాత ఆలయానికి తీసుకొచ్చారు. పట్టణంలోని బొడ్రాయి వద్ద జరిగిన వేడుకల్లో స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని పూజలు చేశారు.

గంగమ్మ ఒడికి దుర్గమ్మ

గంగమ్మ ఒడికి దుర్గమ్మ

గంగమ్మ ఒడికి దుర్గమ్మ

గంగమ్మ ఒడికి దుర్గమ్మ

గంగమ్మ ఒడికి దుర్గమ్మ