
రావణవధకు సిద్ధం
శమజనగామ: జిల్లాలో దసరా సందడి నెలకొంది. పట్టణంలో వ్యాపారం జోరందుకోవడంతో రహదారులన్నీ కిక్కి రిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో రావణవధకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రంగు రంగుల లైటింగ్, శబ్దకాంతుల మధ్య 2న(గురువారం) సాయంత్రం శోభాయమానంగా రావణవధ జరుగనుంది. అమ్మవారి నవరాత్రులు, దసరా పండగను పురస్కరించుకుని పలువురు కుటుంబాలు బొమ్మల కొలువును ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విజయదశమి(దసరా) రోజున రాము డు రావణునిపై విజయం సాధించిన రోజుగా భావిస్తారు. రావణవధ ఉత్సవాలకు సంబంధించి పది తలల రావణాసుర విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. మధ్యాహ్నం పాలపిట్ట దర్శనం చేసుకున్న తర్వాత, సాయంత్రం బతుకమ్మకుంటలో నిర్వహించే రావణవధ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివస్తారు. రావణవధ కోసం భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పది తలల రావణాసురున్ని రెండు గంటల పాటు పేల్చేలా బాణాసంచాను సిద్ధం చేశారు.
ఆలయాల ప్రత్యేక శోభ..
పాలకుర్తి సోమేశ్వరస్వామి, జీడికల్ శ్రీ సీతారా ముల ఆలయం, కొడవటూరు సిద్దులగుట్ట, చిల్పూరు బుగులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, జనగామలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వరాలయం, పాతబీటు బజారు శ్రీ రామ లింగేశ్వరాలయం, చీటకోడూరు పంచకోసు శ్రీరామలింగేశ్వరాలయాలు దసరా పండగకు ముస్తాబయ్యాయి. భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా పండగను పురస్కరించుకుని ఎలాంటి గొడవలు, రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏసీపీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టనున్నారు.
జిల్లాలో పండుగ సందడి
శమీపూజకు ఏర్పాట్లు పూర్తి
ఆలయాల ప్రత్యేక శోభ
బతుకమ్మకుంటలో వేడుకలకు భారీగా తరలనున్న ప్రజలు
రికార్డు స్థాయిలో మద్యం,
మాంసం విక్రయాలు
ఆర్టీసీకి భారీ ఆదాయం..
దసరా పండగ సందర్భంగా జనగామ ఆర్టీసీకి టికెట్ కలెక్షన్లు పెరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందికి పైగా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల ద్వారా స్వగ్రామాలకు చేరుకున్నారు. పండగతో మార్కెట్లు, బస్టా ండ్లు, పూల మార్కెట్లు, రహదారులు జనంతో సందడిగా కనిపించాయి. దసరా పండగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

రావణవధకు సిద్ధం

రావణవధకు సిద్ధం