గ్రూప్‌–2లో సత్తాచాటారు.. | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2లో సత్తాచాటారు..

Sep 29 2025 8:14 AM | Updated on Sep 29 2025 8:14 AM

గ్రూప

గ్రూప్‌–2లో సత్తాచాటారు..

ఎస్సై నుంచి డిప్యూటీ తహసీల్దార్‌గా.. బానాజీపేట గ్రామం నుంచి ఇద్దరు..

గ్రూప్‌–2 ఫలితాల్లో జిల్లా అభ్యర్థులు సత్తాచాటారు. ఆదివారం టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో పలువురు కొలువులు సాధించారు. సామాన్య కుటుంబాలకు చెందిన అభ్యర్థులు అహర్నిశలు కష్టపడి, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరడంపై అభినందనలు వెల్లువెత్తాయి.

పాలకుర్తి టౌన్‌: మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కూటికంటి శివ డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం శివ మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విజయం తన తల్లిదండ్రుల కుటికంటి లక్ష్మీ, వెంకన్న ప్రోత్సాహం వల్లే లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

జనగామ: మండలంలోని బానాజీపేట గ్రామానికి చెందిన ఆకుల నాగరాజు, కొలుపుల మదన్‌మోహన్‌ గ్రూపు –2లో సత్తా చాటారు. ఆకుల నాగరాజు బచ్చన్నపేట మండల ఏఎస్‌ఓగా విధులు నిర్వహిస్తూ గ్రూపు–2లో అసిస్టెంట్‌ ఎస్సీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. కొలుపుల మదన్‌మోహన్‌ మొదటి ప్రయత్నంలోనే గ్రూపు–2లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌ఓ)గా ఎంపికయ్యారు. గ్రామం నుంచి ఇద్దరు గ్రూపు–2లో ఉద్యోగాలు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాగరాజు,మదన్‌ మోహన్‌

ఎకై ్సజ్‌ ఎస్‌ఐగా సివిల్‌

సప్లై ఉద్యోగి..

జనగామ రూరల్‌: మండలంలోని సిద్దెంకి గ్రా మానికి చెందిన సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, నిర్మల కు మారుడు సుంకరి కేదా రేశ్వర్‌రెడ్డి ఆదివారం విడుదల చేసిన గ్రూప్‌– 2 ఫలితాల్లో ఎకై ్సజ్‌ ఎస్‌ఐగా ఉద్యోగం సాధించారు. గతంలో గ్రూప్‌–4లో సివిల్‌ సప్‌లైలో ఉద్యోగం సాధించి విధులు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రూప్‌–3లో స్టేట్‌ 10వ ర్యాంక్‌ సాధించారు.

సింగరేణి ఉద్యోగి..

బీసీ వెల్ఫేర్‌ అధికారిగా

జనగామ: మండలంలోని వడ్లకొండకు చెందిన పన్నీరు లక్ష్మణ్‌ కుమారుడు అమర్‌నాథ్‌ బీసీ వెల్ఫేర్‌ అధికారిగా ఉద్యోగం సంపాదించారు. గ్రూప్‌–4లో ఉద్యోగం సంపాదించి సింగరేణిలో పనిచేస్తున్న అమరనాథ్‌, కష్టపడి చదువుకుని గ్రూప్‌–2 ఉద్యోగం సాధించారు. పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు కొడుకుపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడని అమర్‌నాథ్‌ను గ్రామస్థులతో పాటు స్నేహితులు అభినందించారు.

ఏఆర్‌ ఎస్సై నుంచి అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా

జనగామ: రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్‌ గ్రామానికి చెందిన పుల్ల రవి–పద్మ దంపతుల చిన్న కుమారుడు పుల్ల సాయిచరణ్‌గౌడ్‌ గ్రూపు–2లో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌లో ఎస్సై (ఏఆర్‌)గా విధులు నిర్వహిస్తూ గ్రూపు–2లో ఫలితాల్లో స్టేట్‌ 92 ర్యాంక్‌ సాఽధించి అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ (గెజిటెడ్‌) ఉద్యోగం సాధించారు. ఆయన సోదరుడు సాయికిరణ్‌ సైతం మంచిర్యాల బెటాలియన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించడం విశేషం. తన సోదరుడు, తల్లిదండ్రులు, భార్య అక్షిత ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడినట్లు సాయి చరణ్‌గౌడ్‌ తెలిపారు.

గ్రూప్‌–2లో సత్తాచాటారు..1
1/5

గ్రూప్‌–2లో సత్తాచాటారు..

గ్రూప్‌–2లో సత్తాచాటారు..2
2/5

గ్రూప్‌–2లో సత్తాచాటారు..

గ్రూప్‌–2లో సత్తాచాటారు..3
3/5

గ్రూప్‌–2లో సత్తాచాటారు..

గ్రూప్‌–2లో సత్తాచాటారు..4
4/5

గ్రూప్‌–2లో సత్తాచాటారు..

గ్రూప్‌–2లో సత్తాచాటారు..5
5/5

గ్రూప్‌–2లో సత్తాచాటారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement