
పండగ జరుపుకునేదెలా?
జనగామ: నాలుగు నెలలుగా వేతనాలు లేక పస్తులు పడుతున్న జనగామ చంపక్‌హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ఆల సర్వీసెస్ కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సద్దులు, దసరా పండగ సందర్భంగా చేతిలో చిల్లిగవ్వ లేక సంబురాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెల కొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం కార్మికులు ఎంసీహెచ్ ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. పండగ సమయంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా, కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపేందుకు వేతనాలు విడుదల చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్, కలెక్టర్ దృష్టికి సైతం తీసుకువెళ్లామ న్నారు. 80 మంది కార్మికులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంసీహెచ్ ఎదుట కార్మికుల ఆవేదన