
సీటీఓగా శివశంకర వరప్రసాద్
జనగామ: గ్రూప్–1 ఫలితాల్లో జనగామ పట్టణానికి చెందిన తగరపు నర్సింహులు, పద్మ దంపతుల మూడో కుమారుడు తగరపు శివశంకర వరప్రసాద్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీఓ)ఎంపికయ్యారు. పట్టణంలోని సెయింట్‌పాల్స్ హైస్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తి చేసిన వరప్రసాద్, ఏబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బీఈ చేశారు. మొదటి ప్రయత్నంలోనే నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో రాష్ట్రంలో 330వ ర్యాంకు సాధించారు. వరప్రసాద్‌ను తల్లిదండ్రులు, పట్టణప్రజలు అభినందించారు.