
సౌత్‌జోన్ అథ్లెటిక్స్‌లో ఏబీవీ విద్యార్థికి రజతం
జనగామ రూరల్: గుంటూరు జిల్లాలోని నా గార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించిన 36వ సౌత్ జోన్ అథ్లెటిక్స్‌లో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)కు చెందిన బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న జి.సునీల్‌కుమార్ 18 ఏళ్ల షాట్‌పుట్ వి భాగంలో రజత పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ టి.కళ్యాణి, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది సునీల్‌ను ఘనంగా సన్మానించారు.
మద్యం దుకాణాల టెండర్లు ప్రారంభం
జనగామ: జిల్లాలో 2025–27 నూతన మద్యం పాలసీ నిబంధనల మేరకు దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి అనిత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 50 మద్యం దుకాణాలకు టెండర్లకు పిలవడం జరుగుతుందన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు చలాన్ రూపంలో చెల్లించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు జిల్లా ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్టోబర్ 23వ తేదీన ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాల కేటాయింపుల కోసం లాటరీ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందన్నారు.
సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు
–ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ
కంజర్ల వసుంధర
జనగామ రూరల్: సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ కంజర్ల వసుంధర అన్నారు. శుక్రవారం ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ధర్మకంచలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నాముని పావనికుమారి అధ్యక్షతన మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాలల అభివృద్ధికి కమిషనర్ నిధులు మంజూరు చేశారని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఝెలా శ్రీకాంత్‌రెడ్డి. స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ మరిపెల్ల రవిప్రసాద్, వేముల శేఖర్, మహమ్మద్ అఫ్జల్, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, రజిత తదితరులు పాల్గొన్నారు.
పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
జనగామ: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పత్తిపంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టి కాపాడుకోవాలని భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ డి.శ్రీలత సూచించారు. శుక్రవారం జనగామలో వారు మాట్లాడుతూ.. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా భూమిలో తేమ అధికమై, పంటలో పూత, కాయలు రాలడం కనిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. వర్షాలు ఆగిన వెంటనే పై పాటుగా ఎకరానికి 2 కిలోల 13–0–45తో పాటు 400 గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమం కలిపి పిచికారీ చేయాలన్నారు. అధిక తేమతో కాయకుళ్లు తెగులు వ్యాపించే అవకాశం ఉందని, దీని నివారణకు ఎకరానికి 600 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను 20 గ్రాముల ప్లాంటామైసిన్‌తో కలిపి పిచికారీ చేస్తే సరిపోతుందన్నారు. ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు ఇలా చేస్తే నష్టం ఉండదన్నారు. ఆకులపై గోధుమ మచ్చల నివారణ కోసం ఎకరానికి 200 మి.లీ. ప్రోపికొనజోల్ పిచికారీ చేసుకోవాలన్నా రు. ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేస్తే సరిపోతుందన్నారు.

సౌత్‌జోన్ అథ్లెటిక్స్‌లో ఏబీవీ విద్యార్థికి రజతం