
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని శుక్రవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓ సూపరింటెండెంట్ వసంతకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం, జిల్లా కోశాధికారి బస్వ రామచంద్రం మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సిబ్బందికి 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలన్నారు. తక్షణమే చెల్లించకుంటే పండగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా గ్రామగ్రామాన ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. జీవో నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు పి.వెంకటేశ్వర్లు ఎస్.కర్ణాకర్, పి.మల్లేశ్, బి.బాల నరసయ్య, కళమ్మ ,సైదమ్మ, రమ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా