
నేడు ఏడొద్దుల బతుకమ్మ
దేవరుప్పుల: ఊరుకు అరిష్టం రావడంతో పెద్దమడూరు, ధర్మగడ్డలో సద్దుల బతుకమ్మ కాస్త ఏడొద్దుల బతుకమ్మగా మారింది. నిజాం కాలం కంటే ముందు ఈ రెండు గ్రామాలు నల్లగొండ జిల్లాలో ఉండేవి. సద్దుల బతుకమ్మ రోజు పలు వాడల్లో నిప్పంటుకొని నివాసిత గుడిసెలు కాలిపోయాయి. దీంతో ఊరుకు అరిష్టమని మరుసటి ఏడాది నుంచి ఏడో రోజే సద్దుల బతుకమ్మను ఆడి నిమజ్జనం చేసేలా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి కోడళ్లు, ఇంటి ఆడబిడ్డలు కలిసి ఆడడం, 9వ రోజు తిరిగి ఇక్కడి కోడళ్లు పుట్టినిల్లు, ఇక్కడి కూతుర్లు మెట్టినింట్లోకి వెళ్లి అక్కడ సద్దుల బతుకమ్మ ఆడే అరుదైన అవకాశం లభిస్తోంది. ఎడొద్దుల బతుకమ్మ వేడుకలకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు.
ధర్మగడ్డ, పెద్దమడూరులో ముందే సద్దులు