
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మచ్చుపహాడ్ విద్యార్థి
నర్మెట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మచ్చుపహాడ్‌కు చెందిన గజ్జెల్లి జీవన్ ఎంపికయ్యాడు. నిజామాబాద్ ము ప్కాల్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొని ఎంపికై న జీవన్ జనగామ ఏకశిలా ఒకేషనల్ జూని యర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. రెండోసారి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో మచ్చుపహాడ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు కాసు కనకరాజు, గ్రామస్థులు గురువారం అభినందించారు. ఈసందర్భంగా జిల్లా కబడ్డీ అసోషియేషన్ కార్యదర్శి గట్టయ్య, మండల అధ్యక్షుడు గుండేటి రాంచందర్, కార్యదర్శి కొంపెల్లి అంబేడ్కర్, సభ్యులు గొల్లపల్లి రాజు, వినోద్ , వేణు హర్షం వ్యక్తం చేశారు.