
‘ప్రీప్రైమరీ’ మరింత బలోపేతం
మండలాల వారీగా
ఖాళీల వివరాలు
జనగామ రూరల్: ప్రీప్రైమరీ విద్య మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలోని 12 మండలాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈనేపథ్యంలో పాఠశాలల్లో బోధకులు, ఆయాలుగా రెండు పోస్టులు మంజూరు చేశారు. అంగన్‌వాడీలో కేవలం పౌష్టికాహారంతో పాటు ఆటాపాటలతో విద్యాబోధన చేసేవారు. అంగన్‌వాడీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కేంద్రాల్లోని చిన్నారులను ఆకట్టుకునే విధంగా వసతుల కల్పనకు పెద్దపేట వేసింది. ఈ మేరకు కేంద్రాలకు రకరకాల పరికరాలు, రంగురంగుల మ్యాట్లు, టేబుళ్లు పం పిణీ చేసింది. కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యావిధానాన్ని మెరుగుపరిచే దిశగా మాతా, శిశు సంక్షేమశాఖ కృషి చేస్తోంది. జిల్లాలోని 12 మండలాల్లో మంజూరు అయిన 12 అంగన్‌వాడీ కేంద్రాలకు బోధకులు, ఆయా పోస్టులు మంజూరు చేసింది. బోధకులు 12, ఆయాలు 12 పోస్టులు మొత్తం 24 పోస్టులు తాత్కాలిక పద్ధతిలో పోస్టులు భర్తీ చేయనుంది.
అర్హతలు
ఫ్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్ట్‌కు కనీస అర్హతగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. బాల్యవిద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, బోధనలో పూర్వ అనుభవం కలవారికి, వితంతువులకు ప్రత్యేక వెయిటేజ్ ఉంటుంది. ఆయా పోస్ట్‌కు కనీస విద్యార్హత ఏడో తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలని, జిల్లాలోని సంబంధిత మండలానికి చెందిన గ్రామపంచాయతీ పరిధిలో నివాసం కలిగి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు 18 సంవత్సరం నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుందన్నారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమని, గౌరవ వేతనంగా ప్రతి విద్యాసంవత్సరానికి 10 నెలలు మాత్రమే చెల్లించడం జరుగుతుందన్నారు. బోధకులకు 8వేలు, ఆయాలకు 6వేలు గౌరవ వేతనం ఉంటుంది. 24 నుంచి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి దరఖాస్తులను అక్టోబర్ 4వ తేదీ వరకు స్వీకరిస్తారు.
పాలకుర్తి: ఎంపీపీఎస్ పాలకుర్తి–2
ఎంపీపీఎస్ గూడూర్–2
దేవరుప్పుల: ఎంపీపీఎస్ సింగరాజుపల్లి –2, ఎంపీపీఎస్ కోలుకొండ–2
రఘునాథపల్లి: ఎంపీపీఎస్ కంచనపల్లి –2,
ఎంపీపీఎస్ ఖిళాషాపురం–2
జనగామ: ఎంపీయూపీఎస్ యశ్వాంతాపూర్ –2, జనగామ పట్టణంలోని ఎంపీపీఎస్ రాజీ వ్‌నగర్ కాలనీ–2, ఎంపీపీఎస్ పసరమడ్ల–2
స్టేషన్ ఘన్‌పూర్:
ఎంపీపీఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ –2
జఫర్‌ఘడ్ : ఎంపీపీఎస్ తమ్మడపల్లి జీ–2
కోడకండ్ల : ఎంపీపీఎస్ కొడకండ్ల –2.
12 పాఠశాలలకు బోధకులు,
ఆయా పోస్టులు మంజూరు
తాత్కాలిక పద్ధతిలో నియామకం