జనగామ: జిల్లాలో విద్యుత్ వినియోగించే హెచ్‌టీ వినియోగదారులు ఆటోమేటిక్ ఓల్టేజ్ రెగ్యులేటర్లు వినియోగించాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. జిల్లా కేంద్రం డివిజన్ కార్యాలయంలో బుధవారం ఎస్‌ఈ ఆధ్వర్యంలో హెచ్‌టీ వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ.. హెచ్‌టీ కస్టమర్లు తప్పకుండా యూనిటీ పవర్ ఫ్యాక్టర్‌ను మెయింటెన్ చేయాలని సూచించారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్‌ఏవో జయరాజు, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌టీ వినియోగదారులతో
ఎస్‌ఈ సమావేశం