
90 రోజుల్లోనే అభివృద్ధి పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: 90 రోజుల్లోనే మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈనెల 23న(మంగళవారం) మేడారానికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను జిల్లా అధికారులు, పూజారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, జిల్లా ఉన్నతాధికారులతో పాటు సమ్మక్క–సారలమ్మ పూజారులతో మంత్రి సీతక్క ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 12 గంటలకు సీఎం మేడారానికి చేరుకుని తొలుత అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మాస్టర్ ప్లాన్ డిజైన్ పూజారులతో కలిసి సీఎం ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన మరుసటి రోజు నుంచి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 90 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన సాగుతాయని, ఈ పనుల్లో 2వేల మంది పాల్గొనున్నట్లు వివరించారు.
వనదేవతలపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న భక్తి విశ్వాసంతో మేడారం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆయన ప్రత్యేక దృష్టిసారించి జాతరకు ముందుస్తుగా మేడారానికి వస్తున్నారని తెలిపారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క