ధాన్యం కొనుగోళ్లకు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు

Sep 21 2025 1:35 AM | Updated on Sep 21 2025 1:35 AM

ధాన్య

ధాన్యం కొనుగోళ్లకు

2.13 లక్షల ఎకరాల్లో వరి సాగు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు

ఐకేపీ, పీఏసీఎస్‌ పరిధిలో

309 సెంటర్లు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు

అక్టోబర్‌ 15 నుంచి కొనుగోళ్లు

కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం..

సమాయత్తం

జనగామ: వానాకాలం సీజన్‌ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్‌ శాఖల ఆధ్వర్యంలో 309 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ 185 (11 సన్నాలు), పీఏసీఎస్‌ 124 (198 దొడ్డు రకం) పరిధిలో ఉంటాయి. ఈ సీజన్‌లో జిల్లాలో 2.05 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరగనుందని ముందస్తు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి 40 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం జిల్లాలో 9 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన గన్నీల కోసం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసేలా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలోని 12 మండలాల పరిధిలో 2.13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వచ్చే నెల అక్టోబర్‌ మాసం మొదటి వారం నుంచి కోతలు మొదలు కానున్నాయి. ఈసారి యూరియా కష్టాలు రావడంతో కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత సాగు అంచనా మేరకు 4 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొంతమేర ప్రైవేట్‌ ద్వారా విక్రయాలు జరుగగా, ప్రభుత్వం 2.05లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికలను తయారు చేసుకున్నారు. కేంద్రం ఈసారి వరి ధాన్యానికి మద్దతు ధర పెంచింది. క్వింటా ఏ గ్రేడ్‌ ధర రూ.2,389, కామన్‌కు రూ.2,369 మద్దతు ధర ఇవ్వనున్నారు.

ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం తేమ కొలిచే యంత్రాలు 365, ఎలక్ట్రానిక్‌ కాంటాలు 352, టార్పాలిన్‌లు 6,853 ఉండగా, ఆటోమేటిక్‌ ప్యాడీ క్లీనర్లు 179 అవసరముండగా, 122 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత నియంత్రణ, నిల్వ, రవాణా సౌకర్యాలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు, సాంకేతిక సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధాన్యం రవాణా కోసం లారీ కాంట్రాక్టర్‌తో సంప్రదింపులు జరుపుతుండగా, మిల్లర్లతో సైతం చర్చలు కొనసాగుతున్నాయి. రైతులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్మే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసింది.

వేర్వేరుగా దొడ్డు, సన్నరకం కేంద్రాలు

2.05 లక్షల టన్నుల కొనుగోళ్లు అంచనా

గన్నీ బ్యాగుల కోసం ప్రభుత్వానికి నివేదిక

ఐకేపీ సెంటర్లు:185

పీఏసీఎస్‌ సెంటర్లు:124

కొనుగోళ్ల అంచనా : 2.05 లక్షల టన్నులు

గన్నీ బ్యాగుల అవసరం: 40లక్షలు

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వచ్చే నెల అక్టోబర్‌ 15వ తేదీ నుంచి కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులు మద్దతు ధరపై ధాన్యం అమ్మేందుకు వీలుగా స్పష్టమైన షెడ్యూల్‌ను గ్రామ, మండల స్థాయిల్లో వెల్లడించనున్నారు. ఈ క్రమంలో రైతులు ముందుగానే తమ పంటను తగిన తేమ స్థాయిలో ఆరబెట్టి, కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల శ్రమ వృథా కాకుండా, వారికి మద్దతు ధర చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈసారి జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌ పరిధిలో 309 ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. గత యాసంగి సీజన్‌ కంటే 22 సెంటర్లు పెరిగాయి. సెంటర్ల పరిధిలో గన్నీ బ్యాగుల కొరత రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత నాణ్యమైన సేవలను అందించే విధంగా ప్లాన్‌ చేస్తున్నాం.

ధాన్యం కొనుగోళ్లకు1
1/1

ధాన్యం కొనుగోళ్లకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement