
పూల సింగిడి
నేడు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ
జనగామ: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అతిపెద్ద పండుగ బతుకమ్మ. నేడు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా తంగేడు, గునుడు, చామంతి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పూలను తీసుకువచ్చిన కార్మికులు వాటితో ఉపాధి పొందుతున్నారు. వస్త్ర దుకాణాలు, రంగుల షాపులు మహిళలతో కిక్కిరిసి పోయాయి. నేటి నుంచి ఆరంభమయ్యే బతుకమ్మ వేడుకల సందర్భంగా నేల చామంతి, తంగేడు, గునుడు, గడ్డిపూలను సేకరించేందుకు చిన్నారులు అడవిబాట పట్టారు.
అమ్మో చామంతి...
ఈసారి బతుకమ్మ వేడుకలకు పూలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. బంతిపూలు కిలో రూ.100 పలుకుతుండగా, చామంతికి డిమాండ్ బాగా పెరిగింది. కిలో పూలు రూ.550 ఉండగా, పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. అటవీ ప్రాంతాల్లో తంగేడు చెట్లు కను మరుగుకావడంతో మార్కెట్‌లో రూ.100కు మూడు కట్టలు మాత్రమే ఇస్తున్నారు.
ఆర్టీసీకి ఫుల్‌జోష్
నేటి నుంచి బతుకమ్మ పండుగతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రారంభమవుతుండటంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరి పోయింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పాలకుర్తి బస్టాండ్ పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రయాణికులు వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉప్పల్, హనుమకొండ తదితర రూట్లలో నడిపించే స్పెషల్ బస్సు సర్వీసుల్లో టికెట్ చార్జీలు పెంచి తీసుకుంటున్నారు. సిద్దిపేట, నెహ్రూపార్కు, ఆర్టీసీ చౌరస్తాలో రోడ్డులో ట్రాఫిక్ పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటున్నారు.
బస్టాండ్‌లో
ప్రయాణికుల రద్దీ
జోరందుకున్న
పూల అమ్మకాలు

పూల సింగిడి

పూల సింగిడి

పూల సింగిడి

పూల సింగిడి

పూల సింగిడి