సాగుకు సరిపడా యూరియా
జనగామ రూరల్: విద్యావ్యవస్థలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. శని వారం కలెక్టరేట్‌లో విద్యావ్యవస్థ పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారి, ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్ కు మార్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యవంతులుగా ఉంటేనే విద్యపై దృష్టి పెడతారని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ప్రతీ రోజు అధికారులు పర్యవేక్షిస్తూ ఫొటోలు అప్ లోడ్ చేయాలన్నారు. 9, 10, ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకొని ప్రతిరోజు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేసి ప్రతీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తామని, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాల పంపిణీ, విద్యార్థులకు యూనిఫామ్ అందించామన్నారు. నిరంతరం మధ్యాహ్న భోజ నానికి వినియోగించే కూరగాయలు, గుడ్లు, పప్పు వంటి సామగ్రి నాణ్యతను పరిశీలిస్తున్నామన్నారు. ఈ వీసీలో ఏఎంఓ శ్రీనివాస్, జిల్లా బాలికల పరిరక్షణ అధికారిణి గౌసియా బేగం, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
జాతీయ రహదారుల నిర్మాణ పనులు
జిల్లాలోని దుద్దేడలో 365 బి జాతీయ రహదారి పనులు సాఫీగా కొనసాగుతున్నాయని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్‌కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జాతీయ రహదారుల పనుల ప్రగతిపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వీసీలో సమీక్షించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై 51శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ వీసీలో ఆర్డీఓ గోపిరామ్, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో యూరియా నిల్వలను సమృద్ధిగా ఉన్న ట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సమన్వయంతో అన్ని మండలా ల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో మొ త్తం 1,000 మెట్రిక్ టన్నులకుపైగా యూరియా నిల్వలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రతీ మండలానికి తగిన కోటా కేటాయించామని, రైతులు తమకు కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్ షాపుల ద్వారా యూరియా పొందవచ్చన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, మండల స్థాయి సిబ్బంది, సహకార సంఘాలు సమన్వయంతో పని చేయాలన్నారు.
వీసీలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్
సెక్రటరీ యోగితా రాణా