
హామీలను నెరవేర్చాలి
పాలకుర్తి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉద్యమకారుల చైతన్య యాత్రలో భాగంగా మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనతంరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమకారుల హామీల అమలుకు వెంటనే కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. 250 గజాల ఇంటి స్థలం, రూ. 25 వేల పెన్షన్, ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. ఉచిత బస్సు, ఆరోగ్యకార్డులు, సంక్షేమ పథకాల్లో 20 శాతం కోటా కేటాయించాలన్నారు. హామీల అమలుకు అక్టోబర్ 26న హైదరాబాద్ ఇందిరపార్క్‌లో జరిగే ఉద్యమకారుల సభను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నలమాస రమేశ్, నియోజకవర్గ కన్వీనర్ సంగీ వెంకన్నయాదవ్, మండల అధ్యక్షుడు అనుమల అంజిరావు, గుగులోతు రాములు నాయక్, తిరుపతిరెడ్డి, యాకయ్యగౌడ్, రాజు, దండయ్య, మార్కేండయ్య, ఉద్యమకారులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల ఫోరం
రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్