
రాష్ట్రపతి నిలయంలో గబ్బెట విద్యార్థులు
రఘునాథపల్లి: మండలంలోని గబ్బెట ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. విజ్ఙాన సముపార్జనలో భాగంగా చారిత్రాత్మకమైన రాష్ట్రపతి నిలయాన్ని తిలకించడంలో విద్యార్థులు అసక్తిని కనబరిచారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం సునంద మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న అభివృద్ధి సముపార్జనతో పాటు విద్యార్థులకు చారిత్రాత్మక, భౌగోళికమైన అంశాలపై అవగాహన ఎంతో అవసరమని, అందుకే రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకుమార్, ఉమాదేవి, జయ, సీఆర్‌పీ జ్యోతి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక, వీఓఏ రుక్సానా, ఎల్లమ్మ తదితరులు ఉన్నారు.