
యుద్ధ ప్రాతిపదికన చెరువు మరమ్మతు
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్: వరద తాకిడికి కండ్లపల్లి చెరువు కట్ట ధ్వంసమయ్యే ప్రమాదం ఉండటంతో యుద్ధ ప్రతిపాదికన చెరువు మరమ్మతు పనులు చేపడతామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి చెరువు కట్టను గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కట్టతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరమ్మతు పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ కన్‌స్ట్రక్షన్ ఎస్‌ఈ బుచ్చిరెడ్డి, జగదీశ్వర్‌తో ఫోన్లో మాట్లాడి కట్ట పరిస్థితిని వివరించారు.
పలువురికి పరామర్శ
మేడిపల్లి: జెడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు అమ్మమ్మ, వెలమ సంఘం సయుక్త కార్యదర్శి రవీందర్‌రావు తల్లి ఆయిల్నేని లలితమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్ రెడ్డి కుమారుడు చనిపోగా.. వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.