
662 టీఎంసీలు గోదావరి పాలు
అత్యధికంగా వరద కాల్వకు 50.548 టీఎంసీలు కాకతీయ కాలువకు 21.15 టీఎంసీలు ప్రాజెక్టు నిల్వకు ఏడు రెట్లు అధికంగా వరద నీరు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ నీటిని ఎప్పటికప్పుడు గోదావరి నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 90.138 టీఎంసీలు కాగా.. జూన్ నుంచి ఇప్పటివరకు సుమారు ఏడు రెట్లు అధికంగా నీరు వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు నుంచి అన్ని కాలువలకు నీరు విడుదల చేశారు. గేట్ల ద్వారా 662.891 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ఆగస్టులో 188.630 టీఎంసీలు, సెప్టెంబర్లో 391.493 టీఎంసీలు, అక్టోబర్లో 82.768 టీఎంసీలు గోదావరిలోకి వదిలారు. జూన్ నుంచి ప్రాజెక్టులోకి 812.755 టీఎంసీల వరద నీరు చేరగా.. 745.49 టీఎంసీలను వదిలారు. తాగునీటికి 2.515 టీఎంసీ ల నీటిని జగిత్యాల, కోరుట్ల, ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాల ప్ర జల దాహార్తి తీర్చేందుకు వినియోగించారు. ప్రతి రోజు 709 క్యూసెక్కుల చొప్పున ఈ ఏడాది ఇప్పటివరకు 5.064 టీఎంసీల నీరు ఆవిరి అయ్యింది.