
నమస్తే సదా వత్సలే..
రాయికల్: ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రాయికల్ పట్టణంలో స్వయంసేవకులు సుమారు వెయ్యి మంది శివాజీ చౌక్, గాంధీవిగ్రహం, పాతబస్టాండ్ మీదుగా పథ సంచాలన్ చేపట్టారు. నమస్తే సదా వత్సలే.. అంటూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాడిన దేశభక్తి గేయాలు ఆకట్టుకున్నాయి. పట్టణ ప్రజలు పూలు చల్లి స్వాగతం పలికారు. హిందూ ధర్మ పరిరక్షణే ఆర్‌ఎస్‌ఎస్ ధ్యేయమన్నారు. ఆచార, సంప్రదాయాలను ప్రపంచ దేశాలన్నీ ఆదర్శంగా తీసుకుంటున్నాయని, వాటిని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని, భారతీయులంతా ఐక్యంగా ఉంటూ సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు.

నమస్తే సదా వత్సలే..