ప్రతిభకు ‘ఉపకారం’ | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు ‘ఉపకారం’

Oct 6 2025 2:26 AM | Updated on Oct 6 2025 2:26 AM

ప్రతి

ప్రతిభకు ‘ఉపకారం’

‘ఎన్‌ఎంఎంఎస్‌’తో పేద విద్యార్థులకు భరోసా నేటితో ముగియనున్న దరఖాస్తులకు గడువు డిసెంబర్‌ 7న రాతపరీక్ష ఎంపికై తే ఏటా రూ.12 వేల స్కాలర్‌ షిప్‌

మల్లాపూర్‌: పేదరికం చదువుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది. ఎనిమిదో తరగతి డ్రాపౌట్స్‌ను నివారించేందుకు ఏటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)తో ప్రోత్సహిస్తోంది. ఎంపికై న విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకు ఏటా రూ.12వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తోంది.

అర్హతలు

2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్‌, మోడల్‌, ఎయిడెడ్‌ తదితర పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్‌షిప్‌నకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలు ఉండాలి. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతూ ఏడో తరగతిలో జనరల్‌, బీసీ కులానికి చెందిన వారు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు. జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఆన్‌లైన్‌లో http//bre.telangana.gov.in ఎస్‌బీఐ కలెక్టర్‌ ద్వారా ఫీజు చెల్లించాలి. దరఖాస్తులకు ఈనెల ఆరో తేదీ చివరి గడువు.

డిసెంబర్‌ 7న రాతపరీక్ష

ఎన్‌ఎంఎంఎస్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో విద్యార్థులకు డిసెంబర్‌ 7న రాత పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

పరీక్ష విధానం..

‘ఎన్‌ఎంఎంఎస్‌’ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి మెంటల్‌ ఎబిలిటి (ఎంఏటి), రెండో ది అప్టిట్యూట్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ). ఇందులో ఏడు, 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని సైన్స్‌, గణితం, సామాజి క అధ్యయనాల విభాగాల్లో 90 మార్కులు చొప్పున మొత్తం 180 మార్కులు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. కనీస అర్హత మార్కులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం కటాఫ్‌గా నిర్ణయించారు. ఎంపిక సమయంలో రిజర్వేషన్‌ నిబంధన పాటిస్తారు.

నాలుగేళ్లుగా స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థులు

ఏడాది విద్యార్థులు 2021–22 67 2022–23 65 2023–24 64 2024–25 72

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 6లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 7న నిర్వహించే అర్హత పరీక్షలో ప్రతిభ కనభరిస్తే నాలుగేళ్లపాటు ఏటా రూ.12 వేల చొప్పున అందిస్తారు. రాము, డీఈవో

ప్రతిభకు ‘ఉపకారం’1
1/1

ప్రతిభకు ‘ఉపకారం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement