
ప్రజావాణి రద్దు● కలెక్టర్ సత్యప్రసాద్
దాడికి పాల్పడిన నిందితులపై కేసు
కోరుట్ల: కోరుట్ల తహసీల్దార్ కార్యాలయ ఆర్‌ఐ, సిబ్బందిపై దాడి చేసిన సంఘటనలో బాధ్యులైన లారీ ఓనర్, డ్రెవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి ఆదివారం తెలిపారు. ఐదు రోజుల క్రితం ఆర్‌ఐ రాజేందర్‌రావు, సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నారు. ఈ క్రమంలో లారీ ఓనర్ సింగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి రెవెన్యూ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు దాడికి పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపై ఈనెల 4న శ్రీమతలబు ఏమిటో శ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీ కథనం ప్రచురించింది. స్పందించిన ఆర్‌ఐ దాడికి పాల్పడిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన లారీ ఓనర్ ప్రవీణ్‌రెడ్డి, డ్రైవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
మెట్‌పల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతోనే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉందని, ఈ స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిట్నేని రఘు, వడ్డెపల్లి శ్రీనివాస్, చెట్లపల్లి సుఖేందర్, బొడ్ల రమేశ్ తదితరులున్నారు.
ఎన్నికల్లో పక్కా
ప్రణాళికతో ముందుకెళ్లాలి
కథలాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని తాండ్య్రాలలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు, యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు ఏనుగు జలంధర్‌రెడ్డి, కథలాపూర్ మహేశ్, పిడుగు ప్రతాప్‌రెడ్డి, గంగాధర్, శంకర్, అంజయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.

ప్రజావాణి రద్దు● కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణి రద్దు● కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణి రద్దు● కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణి రద్దు● కలెక్టర్ సత్యప్రసాద్