
అన్నిస్థానాలు గెలవాలి
ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక డీసీసీలదే అధిష్టానానికి జెడ్పీటీసీ ఆశావహుల జాబితా సర్వే అనంతరం అభ్యర్థుల ఖరారు హైకోర్టు తీర్పు సానుకూలంగా ఉంటుందని ధీమా ఎమ్మెల్యే సంజయ్, జీవన్‌రెడ్డి జాబితాలపై చర్చ స్థానిక ఎన్నికలపై ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ నేతల సమావేశం
సాక్షి ప్రతినిది, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులంతా గాంధీభవన్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేతృత్వంలో స్థానిక సంస్థల అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలాలు, బలహీనతలు, అనుకూలతలు, అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావులతోపాటు ప్రణవ్‌బాబు (హుజురాబాద్), వెలిచాల రాజేందర్ రావు (కరీంనగ ర్), అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి (కరీంనగర్), కేకే మ హేందర్‌రెడ్డి (సిరిసిల్ల) తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థుల ఎంపిక ఇలా
అభ్యర్థుల ఎంపికపై కూలంకుశంగా చర్చ జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే అప్పగించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే స్థానికంగా బలాల ఆధారంగా ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. జెడ్పీటీసీల విషయంలోనూ డీసీసీ అధ్యక్షులు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి పీసీసీ అధ్యక్షుడికి పంపుతారు. అధిష్టానం రహస్యంగా సర్వే నిర్వహించి, నలుగురిలో ఒకరి పేరును ఖరారు చేస్తారు. అభ్యర్థుల జాబితాను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం.
స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయంపైనా చర్చించారు. 42శాతం రిజర్వేషన్లకు అన్నిపార్టీలు తమ సానుకూలత వ్యక్తం చేశాయని, కోర్టు తీర్పు అనుకూలంగానే వస్తుందని సానుకూలత వ్యక్తం చేశారు. తీర్పు ప్రతికూలంగా వస్తే.. ఎలా వ్యవహరించాలో కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి హాజరై తాను సిద్ధం చేసిన జాబితాను అందజేసినట్లు తెలిసింది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మాజీమంత్రి జీవన్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. సంజయ్ చేరికను ఆదినుంచి వ్యతిరేకిస్తున్న జీవన్‌రెడ్డి.. తన వర్గీయులకు ఎలాగైనా టికెట్ ఇప్పించుకోవాలన్న పంతంతో ఉన్నారు. వీరిద్దరి విషయంలో ఎవరి జాబితా ఖరారు చేస్తారన్న విష యం అధిష్టానానికి చూసుకుంటుందని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి ‘సాక్షి’కి తెలిపారు.
కోర్టు తీర్పు..
సంజయ్ జాబితాపై చర్చ