
తెగ తాగేశారు..
జగిత్యాలక్రైం: జిల్లాలో దసరా పండుగ వేడుకల్లో మద్యం ప్రియులు తెగతాగేశారు. ఒకే రోజు రూ.1,49,30,648 మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు రూ.59,79,21,347 మద్యం అమ్మకాలు జరుగగా.. ప్రస్తుతం సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటివరకు రూ.71,82,27,141 అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే రూ.12,03,05,794 అమ్మకాలు పెరిగాయి. మొదట ఎకై ్సజ్ అధికారులు సెప్టెంబర్ మాసంలో వినాయక నిమజ్జనం, దసరా, దుర్గామాత ఉత్సవాలు ఉండటంతో మద్యం అమ్మకాలు తగ్గుతాయని ఊహించినా అంచనాల కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి.
రికార్డుస్థాయి ఆదాయం
జిల్లాలో 21 బార్లు, 71 వైన్స్‌లు ఉన్నాయి. 2024 సెప్టెంబర్‌లో 49,543 లిక్కర్ కేసులు, 1,31,937 బీరుపెట్టెలు అమ్మగా.. రూ.59,79,21,347 ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో జిల్లాలో 58,849 లిక్కర్ కేసులు, 1,21,381 బీరుపెట్టెలు అమ్మగా రూ.71,82,27,141 ఆదాయం వచ్చింది. దీంతో గతేడాది కంటే ఈసారి రూ. 12,03,05,794 రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.
గ్రామాల్లో ఏరులై పారిన మద్యం
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దసరా వేడుకలకు భారీగా మద్యం ఏరులై పారింది. దసరా రోజు గాంధీ జయంతి ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా రెండు రోజుల ముందు నుంచే వైన్స్‌ల వద్ద మద్యం ప్రియులు పెద్ద ఎత్తున క్యూలో ఉండి భారీగా మద్యం కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో గత ఏడాది కంటే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.
మద్యం అమ్మకాలు పెరిగాయి