
సత్ప్రవర్తనతో జైలు నుంచి బయటకు రావాలి
జగిత్యాలజోన్: ఖైదీలకు జైలు జీవితం ఒక గుణపాఠంగా మారి, సత్ప్రవర్తనతో జైలు నుంచి బయటకు రావాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి మల్లిక్ వెంకటసుబ్రమణ్యశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్ జైలులో గురువారం నిర్వహించిన ఖైదీల దినోత్సవంలో మాట్లాడారు. తెలి సోతెలియకో నేరాలు చేసి జైలుకు రావడం వల్ల కు టుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. ఇకనైనా తప్పులు చేయకుండా సమాజంలో మంచి నడవడిక కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న వసతులు, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైలర్ మొగిలేశ్, హెడ్ వార్డర్ మజారొద్దీన్, జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కట్కం చంద్రమోహన్, జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.
కొండగట్టు ఈవోపై ఎమ్మెల్యే ఆగ్రహం
మల్యాల: కొండగట్టు ఆలయ ఈవో ప్రవర్తనపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దసర పండుగ పురస్కరించుకొని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గరుడ సేవ, శమీ పూజలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే వాహనానికి ఆలయ రాజగోపురం ఎదుట పూజ చేయించేందుకు వాహనం తీసుకువచ్చారు. ఆలయం వెనుక వైపు వాహన పూజ చేసుకోవాలని ఈవో శ్రీకాంత్‌రావు సూచించడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అర్చకులు ఎమ్మెల్యే వాహనానికి పూజ చేయడంతో వివాదం సద్గుమణిగింది.