
గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించాలి
గాంధీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్
నివాళి అర్పిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలటౌన్: గాంధీ మహాత్ముడు సూచించిన అహింసా, శాంతి మార్గాన్ని అందరూ అనుసరించి ఆచరించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌లో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్‌లత, డీడబ్ల్యూవో నరేశ్, బీసీ సంక్షేమ అదికారి సునీత, మెప్మా పీడీ శ్రీనివాస్‌గౌడ్, హకీం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో..
జగిత్యాలక్రైం:జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమా ర్ మాట్లాడుతూ అహింసతో అఖండ భారతావనికి స్వాతంత్య్రం తీసుకవచ్చిన మహాత్ముడు గాంధీజీ అని అన్నారు. ఆయన సిద్ధాంతాలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ఆరీఫ్ అలీఖాన్, ఆర్‌ఐ కిరణ్‌కుమార్, సైదులు, ఆర్‌ఎస్సైలు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించాలి