పదేళ్ల వారంటీతో నిస్సాన్ కొత్త ప్లాన్: పూర్తి వివరాలు | Nissan Launches Indias First 10 Year Extended Warranty for Magnite | Sakshi
Sakshi News home page

పదేళ్ల వారంటీతో నిస్సాన్ కొత్త ప్లాన్: పూర్తి వివరాలు

Aug 12 2025 8:49 PM | Updated on Aug 12 2025 9:12 PM

Nissan Launches Indias First 10 Year Extended Warranty for Magnite

నిస్సాన్ ఇండియా కొత్తగా ప్రారంభించిన 'నిస్సాన్ మాగ్నైట్' కోసం 10 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన భారతదేశంలో అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచిన తరువాత కంపెనీ ఈ ప్లాన్ ప్రకటించింది.

నిస్సాన్ ఇండియా ప్రారంభించిన కొత్త ప్లాన్‌లో 10 సంవత్సరాలు లేదా 2 లక్షల కి.మీ వారంటీని.. కేవలం రోజుకి రూ.12 లేదా కిలోమీటరుకు 0.22 పైసలకే ఎందుకోవచ్చు. వినియోగదారుడు 3+7, 3+4, 3+3, 3+2, లేదా 3+1 సంవత్సరాల వంటి ప్లాన్‌ల నుంచి తమకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు.

ఈ కవరేజ్‌లో ఏడు సంవత్సరాల పాటు సమగ్ర రక్షణ ఉంటుంది. ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ సంవత్సరాలలో ఇంజిన్ అండ్ ట్రాన్స్‌మిషన్ కవరేజ్ ఉంటుంది. ఈ ప్లాన్ నిస్సాన్ అధీకృత వర్క్‌షాప్‌లలో నగదు రహిత మరమ్మతులను అందిస్తుంది.

ఈ ఆఫర్ అక్టోబర్ 2024 నుంచి 3 సంవత్సరాల ప్రామాణిక వారంటీతో విక్రయించబడే కొత్త నిస్సాన్ మాగ్నైట్ మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. 2 సంవత్సరాల ప్రామాణిక వారంటీ కలిగిన పాత మాగ్నైట్ మోడళ్లకు ఈ ఆఫర్ లభించదు.

ఇదీ చదవండి: యెజ్డి రోడ్‌స్టర్ 2025 మోడల్ వచ్చేసింది: ధర ఎంతంటే?

కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్‌బ్యాగులు, 67 శాతం హై-టెన్సైల్ స్టీల్ బాడీ కలిగిన ఈ కారు.. ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టీసీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాగా కంపెనీ ఈ కారును సుమారు 65 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement