
కమ్యూనిస్టులతోనే దేశ భవిష్యత్
బోనకల్: కమ్యూనిస్టులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, వారు లేకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయని సీపీఎం కేంద్ర కమి టీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో సీపీఎం నాయకుడు మాదినేని నారాయణ కుమారుడు, రిటైర్డ్ జడ్జి మాదినేని రాధాకృష్ణ మృతిచెందగా ఆయన కుటుంబాన్ని ఆదివారం తమ్మినేని పరామర్శించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు డబ్బు, పదవుల చుట్టే తిరుగుతుండడం ఆందోళన కలిగి స్తోందని తెలిపారు. కమ్యూనిస్టులు ఇప్పుడు బలంగా లేకున్నా, భవిష్యత్ మాత్రం కమ్యూనిస్టులదేనని చెప్పారు. కమ్యూనిస్టులను హేళన చేసే వారికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని తెలి పారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు మడిపల్లి గోపాల్‌రావు, పొన్నం వెంకటేశ్వరావు, పైడిపల్లి కిషోర్‌కుమార్, గాలి దుర్గారావు, మోదుగు సుధీర్‌బాబు తదితరులు సైతం రాధాకృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని