
ఆయిల్‌ఫెడ్‌లో అవకతవకలపై దర్యాప్తు జరపాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఆయిల్ ఫెడ్ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయిల్ పామ్ రైతుల రాష్ట్ర స్థాయి సదస్సు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుంబూ రు మహేశ్వరరెడ్డి అధ్యక్షతన ఆదివారం ఖమ్మంలో జరగగా రంగారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్ పామాయిల్ సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించినా ఆ స్థాయిలో రైతులకు సలహాలు అందడం లేదన్నారు. అంతేకాక రైతులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు బాధ్యతతో వ్యవహరించడం లేదని చెప్పారు. టన్నుకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని, ఆయిల్ ఫెడ్ ద్వారా సరఫరా చేసిన మొక్కలు పెరగక నష్టోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని కోరారు. రైతు సంఘం నాయకులు తుంబూరు మహేశ్వరరెడ్డి, బొంతు రాంబా బు మాట్లాడగా కొకెరపాటి పుల్లయ్య, కారం శ్రీ రాములు, రావు జోగిబాబు, చేలికాని వెంకట్రావు, దొడ్డ చక్రధర్‌రెడ్డి, బుచ్చన్న, గురువారెడ్డి, సంగీతరెడ్డి, చలపతిరావు, ధనమ్మ, పాషా, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.