
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : మండల పరిఽధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి రద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): అధికారులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున.. కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ వినతిపత్రాలు, దరఖాస్తులు, ఫిర్యాదులను కలెక్టరేట్‌లోని ఈ వార్డ్ విభాగంలో అందజేయాలని సూచించారు. ఆయా ఆర్జీలను పరిష్కారం కోసం సంబంధిత విభాగాలకు పంపిస్తామని పేర్కొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
ఒకరోజు ఆదాయం రూ.44,290
పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 518 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.27,440, 280 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.16,850 ఆదా యం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
జేకే ఓసీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం
ఇల్లెందు : నూతన జేకే ఓసీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్(పీఅండ్‌పీ) కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన ఇల్లెందు ఏరియాలో పర్యటించారు. అనంతరం జీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓసీ ఏర్పాటుకు గల అడ్డంకులు తొలగిపోయేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను అధిగమించాలని, రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉపరితల గనుల్లో ఉద్యోగులు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిని సందర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జీఎం వీసం కృష్ణయ్య, ఎస్‌ఓటు జీఎం రామస్వామి, అధికారులు నరసింహరాజు, గిరిధర్‌రావు, జాకీర్ హుస్సేన్, తుకారం, రామ్మూర్తి, శివ వీరకుమార్, శివప్రసాద్, సతీష్ కుమార్, వెంకటేశం, రత్నం, నాగేశ్వరరావు పాల్గొన్నారు.