
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, ఆదివారం కావడంతో భక్తులు స్వామి వారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. నిత్యకల్యాణంలోనూ భారీగా పాల్గొన్నారు.
గోశాల, శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే గోశాల, శాశ్వత నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన టీకే శ్వేత అనే భక్తురాలు గోశాలకు రూ.75,510, నిత్యాన్నదానానికి రూ.1,01,116 ఆలయ ఈఓ దామోదర్‌రావుకు అందజేశారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన