
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం
కొత్తగూడెంటౌన్: మార్షల్ ఆర్ట్స్ విభాగంలో కొత్తగూడేనికి చెందిన కరాటే మాస్టర్ మాటూరి మహా విష్ణుమూర్తికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 980 మంది కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. కాగా, మార్షల్ ఆర్ట్స్ విభాగంలో తనకు ఈ అవకాశం లభించిందని విష్ణుమూర్తి తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషినాథ్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నానని పేర్కొన్నారు.