కిన్నెరసాని నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

కిన్నెరసాని నీటి విడుదల

Oct 6 2025 2:16 AM | Updated on Oct 6 2025 2:16 AM

కిన్న

కిన్నెరసాని నీటి విడుదల

పాల్వంచరూరల్‌: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున వరదతో కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, 1600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో ఆదివారం నీటిమట్టం 406.60 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్‌కు చెందిన ఒక గేటును ఎత్తి ఉంచి 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.

జిల్లా బాక్సింగ్‌ జట్ల

ఎంపిక

కొత్తగూడెంటౌన్‌: అండర్‌–14, 17 విభాగాల్లో జిల్లా బాలబాలికల బాక్సింగ్‌ జట్లను ఎంపిక చేశారు. ఆదివారం కొత్తగూడెం సీఈఆర్‌ క్లబ్‌లో ఎంపికలు నిర్వహించారు. అండర్‌–14 బాలుర విభాగంలో ఆర్‌.గణేష్‌, కె.ధనుష్‌, టి. మణికంఠ, కె. పార్థు, వి.తనుష్‌, తేజస్‌, అబ్దుల్‌ హాసన్‌, వి.సాయి కిరణ్‌ ఎంపికయ్యారు. అండర్‌ –17 విభాగంలో కె.ఆరుణ్‌కృష్ణ, షేక్‌ అరహాన్‌ ఆలీ, వి.భార్గవ్‌ తేజా, సయ్యద్‌ అబ్దుల్‌ మాలిక్‌లను ఎంపిక చేశారు. అండర్‌–17 బాలికల విభాగంలో టి.హాసిని, బి. రూప, కె.హారిక, బి.జాహ్నవి, ఖ్యాతి భువన శ్రీ, కె.సానియాలు అర్హత సాధించినట్లు నిర్వాహాకులు మట్టపర్తి రమేష్‌ తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ నరేష్‌ ఎంపికలను పర్యవేక్షించగా, కోచ్‌ మట్టపర్తి మానస, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

భారీ కొండచిలువ పట్టివేత

పాల్వంచ: బీసీఎం రోడ్‌లోని కలెక్టరేట్‌(ఐడీఓసీ) సమీపంలో శనివారం రాత్రి 12 అడుగుల కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్‌ అధికారులు, మున్సిపల్‌ స్నేక్‌ రెస్క్యూ స్పెషలిస్ట్‌ సంతోష్‌ అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకుని, అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలారు. కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్‌లు రామ్‌ ప్రసాద్‌, భావ్‌సింగ్‌, సిబ్బంది గణేష్‌, శ్రీకాంత్‌, మహేష్‌, ఏడు కొండలు పాల్గొన్నారు.

భారీ వర్షంతో

కూలిన వృక్షాలు

అశ్వారావుపేటరూరల్‌: మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతోపాటు గాలివాన రాగా మండలంలోని వినాయకపురం–మామిళ్లవారిగూడెం ప్రధాన రహదారిపై రాత్రి పలుచోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి. రహదారికి అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అశ్వారావుపేట పట్టణంలోని ప్రధాన, అంతర్గత మార్గాలు జలమయమయ్యాయి.

విద్యుదాఘాతంతో

రెండు గేదెలు మృతి

ఇల్లెందురూరల్‌: మండలంలోని సత్యనారాయణపురం రైతు చింతిరాల వీరభద్రానికి చెందిన రెండు గేదెలు ఆదివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. తిలక్‌నగర్‌ సమీపంలో 11కేవీ త్రీఫేస్‌ విద్యుత్‌ లైన్‌ తీగలు తెగి కింద పడి ఉండగా, మేత కోసం వచ్చిన గేదెలు విద్యుదాఘాతానికి గురై చనిపోయాయి. గమనించిన పశువుల కాపర్లు మిగతా గేదెలను అటు వైపు రాకుండా మళ్లించారు. సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లిందని, ప్రమాద ఘటనపై ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేశానని రైతు వీరభద్రం తెలిపారు.

కిన్నెరసాని నీటి విడుదల1
1/4

కిన్నెరసాని నీటి విడుదల

కిన్నెరసాని నీటి విడుదల2
2/4

కిన్నెరసాని నీటి విడుదల

కిన్నెరసాని నీటి విడుదల3
3/4

కిన్నెరసాని నీటి విడుదల

కిన్నెరసాని నీటి విడుదల4
4/4

కిన్నెరసాని నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement