
సిల్క్ వస్త్రంపై ‘సీతారాములు’
భద్రాచలంఅర్బన్: సిల్క్ క్లాత్ పట్టుకుంటేనే జారిపోతుంది. అలాంటి బట్టపై ఓపికతో సీతారాముల చిత్రాన్ని వేసి తన భక్తిని చాటుకున్నాడు భద్రాచలానికి చెందిన దారా ముక్తేశ్వర్. బీటెక్ పూర్తి చేసిన ఇతను భద్రాద్రి రాములవారి కల్యాణోత్సవం సందర్భంగా వినియోగించే అడ్డుతెరపై చిత్రాన్ని ఆర్కిలికి పెయింట్స్‌తో గీసిన చిత్రం ఎంతో ఆకర్షణగా నిలిచింది. దాదాపు పది రోజుల 30 గంటలపాటు శ్రమించినట్లు తెలిపాడు. గతంలో రామాలయం చిత్రాన్ని గీశాడు. 3 సెంటీ మీటర్లతో అతి చిన్న మట్టి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు.