
కొనసాగుతున్న కోటమైసమ్మ జాతర
కారేపల్లి: భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ కోటమైసమ్మతల్లి జాతర మూడోరోజు శనివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. ప్రతీ ఏడాది దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ, పర్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో జాతర నిర్వహిస్తుంటారు. ఈనెల2న ప్రారంభమైన జాతర 7వ తేదీ వరకు కొనసాగనుండగా.. భక్తులు భారీగా తరలివస్తున్నారు. ‘అమ్మా మైసమ్మా.. మా తల్లీ మైసమ్మా..’ అంటూ భక్తుల నామస్మరణతో ప్రాంగణం మార్మోగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవాదాయ శాఖ ఈఓ వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్టు చైర్మన్ పట్టాభిరామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మూడోరోజూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు

కొనసాగుతున్న కోటమైసమ్మ జాతర