
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం)/గుండాల: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌పాషా అన్నారు. శనివారం సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్‌లో జరిగిన లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల సమావేశంలో, గుండాల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసిన ప్రతీ స్థానంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత మండల, గ్రామ కమిటీలదేనని తెలిపారు. పోడు భూములకు పట్టాల మంజూరులో పార్టీ కృషి చేసిందని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను అడవినుంచి దూరం చేసే కుట్రలను మానుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 26న ఖమ్మం నగరంలో సీపీఐ శత వసంతాల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. గుండాలలో వివిధ రాజకీయ పార్టీల నుంచి మోకాళ్ల సమ్మయ్య, ఎస్‌కె సాహెబ్ తదితరులు పార్టీలో చేరినట్లు తెలిపారు. సమావేశాల్లో నాయకులు సరిరెడ్డి పుల్లారెడ్డి, రేసు ఎల్లయ్య, ఉప్పుశెట్టి రాహుల్, వాగబోయిన రమేష్, కొమరం హనుమంతు, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, భూక్య దస్రు, ధీటి లక్ష్మీపతి, కోమారి హన్మంతరావు, గుత్తుల సత్యనారాయణ, ధనలక్ష్మి, జక్కుల రాములు పాల్గొన్నారు.
సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలి
పాల్వంచ: ప్రతీ ఇంట్లో సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా అన్నారు. శనివారం బీీఠిసఎం రోడ్‌లో ట్రుజోన్ సోలార్ పవర్ సిస్టమ్ బ్రాంచ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎండి.భవానీ సురేష్, చారుగుండ్ల రమేష్, సందుపట్ల శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా