
విద్యుత్ సబ్ స్టేషన్‌లో నూతన బ్రేకర్
మధిర: సిరిపురం విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన నూతన బ్రేకర్‌ను విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి శనివారం ప్రారంభించారు. సిరిపురం సబ్‌స్టేషన్ లిఫ్ట్ ఫీడర్ నుంచి సిరిపురం లిఫ్ట్‌కు, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను, ప్రత్యామ్నాయంగా కలకోట, సిరిపురం లిఫ్ట్ ఫీడర్లుగా విడదీస్తూ సుమారు రూ.8 లక్షల వ్యయంతో నూత న బ్రేకర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఒకే బ్రేకర్ మీద సిరిపురం లిఫ్ట్‌కు, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను ప్రత్యామ్నాయ నూతన బ్రేకర్ ఏర్పాటుతో ఈ రెండింటినీ విడదీసి అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ డీఈ బండి శ్రీనివాసరావు, మధిర సబ్ డివిజన్ ఏడీఈ ఎం.అనురాధ, రూరల్ సెక్షన్ ఏఈ మైథిలి పాల్గొన్నారు.